రాజమండ్రిలో రామ్ చరణ్‌... గేమ్ చేంజర్‌

June 08, 2024


img

ఏపీలో పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలో జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో మెగా ఫ్యామిలీ ఘనంగా చిరంజీవి ఇంట్లో పవన్‌ కళ్యాణ్‌ చేత కేక్ కట్ చేయించి విజయోత్సవాలు చేసుకుంది.

బాబాయ్ పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికలలో తొలిసారిగా గెలిచిన తర్వాత రామ్ చరణ్‌ రాజమండ్రీడ్రి గేమ్ చేంజర్‌ సినిమా షూటింగ్‌కి వచ్చినప్పుడు, ఆయనకు రాజమండ్రి విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనను ఊరేగింపుగా ఆయన బస చేసిన హోటల్‌కి తీసుకువెళ్ళారు. 

శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్‌ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తికావచ్చింది. ఆ సినిమాలో మిగిలిన కొన్ని సన్నివేశాల షూటింగ్‌ కోసం రామ్ చరణ్‌ రాజమండ్రి వచ్చారు.

 గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్‌కు జోడీగా కియరా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. కోలీవుడ్‌ నటుడు ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్‌.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాస్ర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు. 

నిర్మాతలు దిల్‌రాజు, శిరీశ్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 27వ తేదీన విడుదల కాబోతోంది.    Related Post

సినిమా స‌మీక్ష