ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్!

May 31, 2024


img

ఆనంద్ దేవరకొండ ఇంకా చిన్న సినిమాల చిన్న హీరోగానే కనిపిస్తున్నప్పటికీ, ఒక్కో సినిమాతో వరుసగా హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు. ఈరోజు విడుదలైన ‘గంగం గణేశా’తో మరో హిట్ అతని ఖాతాలో పడింది.

ప్రేక్షకులు వినోదం ఆశించే థియేటర్లకు వస్తారనే పాయింట్ ఆనంద్ దేవరకొండ బాగానే క్యాచ్ చేసిన్నట్లున్నాడు. అందుకే‘గంగం గణేశా’తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మరో హిట్ కొట్టాడు. ఈ క్రెడిట్ దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టికి కూడా వాటా ఉంది. ఓ సింపుల్ లైన్ తీసుకొని కాస్త రొమాన్స్, కాస్త యాక్షన్, కాస్త కామెడీ చక్కగా మిక్స్ చేసి గంగం గణేశా’ అంటే గణేశుడు, ప్రేక్షకులు కూడా ఆశీర్వదించారు. 

ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక, ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేశ్ ముఖ్యపాత్రలు చేసిన ఈ సినిమాకు సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: ఆదిత్య జవ్వాది, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్ చేశారు. 

ఆనంద్ దేవరకొండ ట్రాక్ రికార్డ్ బాగానే ఉన్నందున ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌, డిస్నీ హాట్ స్టార్ ప్లస్ వంటి ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. వాటిలో అమెజాన్ ప్రైమ్‌ ఈ సినిమా హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. నేడు సినిమా విడుదలైంది కనుక జూన్ నెలాఖరులోగా అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో ప్రసారం అయ్యే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష