ఆనంద్ దేవరకొండ బేబీ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో ‘గంగం గణేశా’ యాక్షన్ మూవీతో ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సోమవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తే సినిమా మంచి యాక్షన్ మాత్రమే కాదు మంచి కామెడీ కూడా ఉన్నట్లు అర్దమవుతుంది. ఓ వినాయకుడి విగ్రహం చుట్టూ అల్లుకున్న ఓ క్రైమ్ కామెడీ సినిమాగా తెరకెక్కించిన్నట్లు ట్రైలర్ తెలుపుతోంది. ఇదివరకు పక్కింటి అబ్బాయిలా కనిపించిన ఆనంద్ దేవరకొండ ఈ సినిమా కోసం చాలా శ్రమించి ‘సిక్స్ ప్యాక్’ సాధించాడు.
ఈ సినిమాలో ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇమ్మానుయెల్, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు నిర్మాతలు: కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి, బ్యానర్: హైలైఫ్, కధ, దర్శకత్వం: ఉదయ్ బొమ్మిశెట్టి, సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: ఆదిత్య జువ్వాది, కొరియోగ్రఫీ: పోలాకి విజయ్, స్టంట్స్: నభ, అంజి, ఆర్ట్: కింద మామిడి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు.