పుష్ప రెంజే వేరబ్బా... ఆ ఒక్క సెట్ కోసమే 50 కోట్లట!

February 28, 2024


img

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక మందనలు హీరోహీరోయిన్లుగా వచ్చిన పుష్ప-2 ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. మళ్ళీ అదే టీమ్‌తో పుష్ప ది రైజింగ్ పేరుతో దానికి సీక్వెల్‌ తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబందించి అల్లు అర్జున్‌ ఆడవేషంలో ఉన్న ఫోటో ఒకటి కొన్ని నెలల క్రితం విడుదల చేశారు. 

తిరుపతిలో ఏటా గంగమ్మ జాతర జరుగుతుంది. ఆ జాతరలో మగవారు అటువంటి వేషాలు వేసుకొని గంగమ్మవారిని దర్శించుకొని, ఆటపాటలతో మొక్కులు తీర్చుకుంటారు. విచిత్రమైన ఆ ఆచారాన్నే దర్శకుడు సుకుమార్ తన సినిమాలో ఉపయోగించుకుంటున్నారు. 

బహుశః పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అల్లు అర్జున్‌ ఆ వేషం ధరించి గంగమ్మ జాతరలో పాల్గొంటున్నారేమో?ఆ జాతర సెట్ కోసమే నిర్మాతలు రూ.50 కోట్లు ఖర్చు పెట్టిన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే, ఇది హనుమాన్ సినిమా బడ్జెట్ కంటే రూ.5 కోట్లు ఎక్కువ. 

పుష్ప-2 సినిమాలో ఇంటర్వెల్ ముందు సుమారు 25 నిమిషాల సేపు ఈ సెట్‌లోనే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించిన్నట్లు తెలుస్తోంది. పుష్ప మొదటి భాగానికి వచ్చిన స్పందన చూసి నిర్మాతలు రెండో భాగంలో ఖర్చుకి వెనకడటం లేదు. 

ఈ సినిమాకి సంబందించి మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటకు వచ్చింది. ఈ కధకు చాలా విస్తృతమైన పరిధి ఉన్నందున పుష్ప3 కూడా ఉండవచ్చని అల్లు అర్జున్‌ స్వయంగా చెప్పారు.          

పుష్ప-2లో కూడా ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలు నటిస్తున్నారు. వారితో బాటు కొత్తగా జగపతిబాబు కూడా పుష్ప-2లో చేరారు.  

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. 2024, ఆగస్ట్ 15వ తేదీన పుష్ప-2 విడుదల కాబోతోంది.  Related Post

సినిమా స‌మీక్ష