గామి నుంచి తొలి లిరికల్ వీడియో సాంగ్ విడుదల

February 24, 2024


img

విధ్యాధర కాగిత దర్శకత్వంలో యువ నటుడు విశ్వక్ సేన్, చాందినీ చౌదరీ ప్రధాన పాత్రలలో ‘గామి’ సినిమా నుంచి తొలి లిరికల్ వీడియో సాంగ్ నేడు విడుదల చేశారు. సొమ్మసిల్లిపోయి కూలింది ఈ కాలం... సత్తువంటూ లేక ఇంకెంత కాలం అంటూ సాగే పాటని సానపాటి భరద్వాజ్ పాత్రుడు వ్రాయగా, స్వీకర్ అగస్తీ స్వరపరిచారు.

అనురాగ్ కులకర్ణి, స్వీకర్ అగస్తీ, సుగుణమ్మ కలిసి ఈ పాటను చాలా శ్రావ్యంగా పాడారు. ఈ సినిమాలో హిమాలయాలలో తపస్సు చేసుకునే అఘోరాగా విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. కనుక మానవుడు-దేవుడుకి మద్య గల సంబంధం గురించి తెలుసుకునే ప్రయత్నంలో సాగే అతని అన్వేషణను ఈ పాట రూపంలో చూపారు.   

గామి మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కనుక ఈ నెల 29న థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల చేయబోతున్నట్లు యూవీ క్రియెషన్స్ ప్రకటించింది.

‘గామి’లో విశ్వక్ సేన్, ఎమ్జీ అభినయ, మహమ్మద్ సమాద్, దయానంద్ రెడ్డి, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్‌ పెద్దాడ, రమ్యా పసుపులేటి, శాంతి రావు, మాయాంక్, జాన్ కూట్లే, బొమ్మ శ్రీధర్, రజినీష్ శర్మ, కెఆర్ ఉన్నికృష్ణ, వెంకట్ రామన్ రావు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకు దర్శకత్వం, స్క్రీన్ ప్లే: విధ్యాధర్ కాగిత, ప్రత్యూష వట్యమ్, సంగీతం: నరేశ్ కుమారన్, కెమెరా: విశ్వనాథ్ రెడ్డి, ఎడిటింగ్: రాఘవేంద్ర తిరుణ్, యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చౌన్ అంజి చేశారు. 

వి.సెల్యూలాయిడ్ సమర్పణలో యూవీ క్రియెషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాని నిర్మించారు. 



Related Post

సినిమా స‌మీక్ష