అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అహా ఓటీటీలో

February 24, 2024


img

సుహాస్, శివాని జంటగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా పేరు చూసి అందరూ మంచి కామెడీ, రొమాన్స్ ఉంటుందని భావించడం సహజం. కానీ దర్శకుడు దుష్యంత్ కటికనేని ఓ సామాజిక సమస్యని తీసుకుని కధ అల్లుకోవడంతో సినిమాలో బలమైన భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అన్నిటినీ సమపాళ్ళలో మిక్స్ చేసి సినిమాని చక్కగా తెరకెక్కించడంతో సూపర్ హిట్ అయ్యింది.  

ఇప్పుడు ఈ సినిమా ఆహా ఓటీటీలోకి రాబోతోంది. ఈ విషయం అహా ఓటీటీ సంస్థ ‘మల్లిగాడి మ్యాజికల్ వరల్డ్ కోసం సిద్దం కండి,’ అంటూ ట్వీట్‌ చేసింది. 

ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: వజీద్ బేగ్, ఎడిటింగ్: కోదటి పవన్‌ కళ్యాణ్‌, కొరియోగ్రఫీ: మొయిన్ చేశారు. జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌, మహన్య పిక్చర్స్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని ఈ సినిమాని నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష