మిస్టర్ బచ్చన్ మరో షెడ్యూల్ ఫినిష్: హరీష్ శంకర్‌

February 11, 2024


img

మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది. దాని తర్వాత రవితేజ హరీష్ శంకర్‌ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా డిసెంబర్‌లో మొదలుపెట్టారు.

ఈగల్ పనులు పూర్తి కాగానే రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. రవితేజ, హరీష్ శంకర్‌ ఇద్దరూ సినిమాని చాలా వేగం పూర్తి చేస్తుంటారు. కనుక ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్‌ పూర్తిచేసామని హరీష్ శంకర్‌ ట్వీట్‌ చేశారు.  

ఈ సినిమాలో రవితేజకు జోడీగా బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ బొర్సే నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పనోరమ స్టూడియోస్, టీ సిరీస్ స్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వప్రసాద్, వివేక్‌ అగ్నిహోత్రి కూచిబొట్ల కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం మిక్కీ జె. మేయర్ అందిస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష