నెట్‌ఫ్లిక్స్‌లోకి గుంటూరు కారం!

February 09, 2024


img

త్రివిక్రమ్ శ్రీనివాస్‌, మహేష్‌ బాబు, శ్రీలీల కాంబినేషన్‌లో సంక్రాంతి పండుగకు థియేటర్లలో విడుదలైన గుంటూరు కారం నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. నేటి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారం అవుతోంది. దీని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులను కూడా ఇప్పుడు అలరించబోతోంది. 

జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మొదట నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ మహేష్‌ బాబు వలననే రూ.250 కోట్లు కలెక్షన్ సాధించి ఈ సినిమా గండం గట్టెక్కగలిగింది.

మరో విషయం ఏమిటంటే, సరస్వతీ పుత్ర అని బిరుదు తగిలించుకున్న పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ సినిమా కోసం వ్రాసిన ‘కుర్చీ మడత పెట్టి...’  పాటపై చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఆ పాటకు మహేష్‌ బాబు, శ్రీలీల అద్భుతంగా డ్యాన్స్ చేయడంతో ఈ సినిమాలో ఆ పాటే హైలైట్‌గా నిలిచింది. 

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రావు రమేష్, రమ్య కృష్ణ, జగపతి బాబు, జయరాం, బ్రహ్మానందం, సునీల్, రఘుబాబు, మహేష్ ఆచంట తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు సంగీతం తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.


Related Post

సినిమా స‌మీక్ష