కొత్త తరం యువనటులందరూ చాలా కొత్తకొత్త కధలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. వారిలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. తాజాగా విధ్యాధర కాగిత దర్శకత్వంలో ‘గామి’ అనే సినిమా చేస్తున్నాడు. దీనిలో హిమాలయాలలో తపస్సు చేసుకునే అఘోరాగా విశ్వక్ సేన్ నటిస్తున్నాడు.
ఇటీవలే గామి ట్రైలర్, మేకింగ్ వీడియో విడుదల చేశారు. వాటిని చూస్తే ఈ సినిమా అంచనాలకు మించే ఉండవచ్చనిపిస్తోంది.
గామి సినిమాలో విశ్వక్ సేన్, చాందినీ చౌదరీ, ఎమ్జీ అభినయ, మహమ్మద్ సమాద్, దయానంద్ రెడ్డి, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పెద్దాడ, రమ్యా పసుపులేటి, శాంతి రావు, మాయాంక్, జాన్ కూట్లే, బొమ్మ శ్రీధర్, రజినీష్ శర్మ, కెఆర్ ఉన్నికృష్ణ, వెంకట్ రామన్ రావు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు దర్శకత్వం, స్క్రీన్ ప్లే: విధ్యాధర్ కాగిత, సంగీతం: నరేశ్ కుమారన్, కెమెరా: విశ్వనాథ్ రెడ్డి, ఎడిటింగ్: రాఘవేంద్ర తిరుణ్, యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చౌన్ అంజి చేస్తున్నారు.
యూవీ క్రియెషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ సినిమా మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.