రజనీకాంత్ లాల్ సలాం... నిన్న ట్రైలర్‌, రేపు సినిమా!

February 08, 2024


img

సూపర్ స్టార్‌ రజనీకాంత్ జైలర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు ‘లాల్ సలాం’ అంటూ మరో సినిమాతో రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ బుధవారం విడుదల చేశారు.

దర్శకురాలు ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాని క్రికెట్ ఆట నేపధ్యంలో మత రాజకీయాలు, ఘర్షణలతో కూడిన చాలా సున్నితమైన కధాంశాన్ని తీసుకొని తెరకెక్కించారని ట్రైలర్‌ చూస్తే అర్దమవుతోంది. 

ఈ సినిమాలో సూపర్ స్టార్‌ రజనీకాంత్ ప్రధాన పాత్ర చేస్తుండగా, విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, జీవిత, తంబి రామయ్య, ఆనంతిక సనిల్ కుమార్, వివేక్‌ రామస్వామి ప్రసన్న, తంగదురై ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, డైలాగులు: విష్ణు రామలింగస్వామి, సంగీతం: ఏఆర్ రహ్మాన్, కెమెరా: విష్ణు రంగస్వామి, కొరియోగ్రఫీ: దినేష్, స్టంట్స్‌: అనిల్ అరసు, కిక్ యాస్ కాళి, స్టంట్ విక్కీ, ఎడిటింగ్: బి. ప్రవీణ్ భాస్కర్ చేశారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. రేపు ప్రపంచవ్యాప్తంగా లాల్ సలాం సినిమా విడుదల కాబోతోంది.Related Post

సినిమా స‌మీక్ష