నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘హై నాన్న’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో నాని, మృణాల్ ఠాకూర్ బేబీ కియరా ఖన్నాల మద్య సాగే భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు మనసును తాకే విదంగా ఉన్నాయి. ఓ చక్కటి రొమాంటిక్ స్టోరీ దానిలో ఓ తండ్రీ కూతుర్ల సెంటిమెంట్‌తో దీనిని పాన్ ఇండియా మూవీగా తీశారు కనుక ఉత్తరాది, దక్షిణాది ప్రజలు చక్కగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమాతోనే దర్శకుడుగా పరిచయం అవుతున్న శౌర్వూవ్ ట్రైలర్ స్థాయిలోనే పూర్తి సినిమాని తెరకెక్కించి ఉంటే, అతని ఖాతాలో ఈ తొలి సినిమాతోనే హిట్ పడుతుంది. నాని, మృణాల్ ఠాకూర్ కెరీర్‌లో ఇది మరో సూపర్ హిట్‌గా నిలుస్తుంది.
ఇక ఈ సినిమాకు చక్కటి సంగీతం అందించిన హెషమ్ అబ్దుల్ వాహబ్ కొన్ని పాటలు కూడా పాడారు. వాటిలో గాజుబొమ్మ పాట హైలైట్ అని చెప్పుకోవచ్చు.
ఈ సినిమాకు సంగీతం: హేషం అబ్దుల్ వాహేబ్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: ప్రవీణ్ ఆంథోని, కొరియోగ్రఫీ: బోస్కో మార్టిస్, స్టంట్స్: విజయ్, పృధ్వీ అందించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల కలిసి ఈ ‘హాయ్ నాన్న’ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకాబోతోంది.