మెగాస్టార్ చిరంజీవి-వశిష్ట కాంబినేషన్‌లో మెగా 156వ చిత్రంగా తెరకెక్కుతున్న విశ్వంభర రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో బుధవారం మొదలైంది. ఈ సినిమాని నిర్మిస్తున్న యూవీ క్రియెషన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా ఈ విషయం అభిమానులకు తెలియజేస్తూ ‘క్లాప్ బోర్డు’ ఫోటో పెట్టింది. దానిలో 9వ సీన్ మొదటి షాట్, మొదటి టేక్ తీస్తున్నట్లు పేర్కొంది.
ఈ సినిమాను దసరా పండుగ రోజున పాటల రికార్డింగ్ కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభించారు. దీనిలో ఆరు పాటలుంటాయని సంగీతం సమకూరుస్తున్న ఎంఎం కీరవాణి తెలిపారు. సోషియో ఫాంటసీ జోనర్‌లో తీస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా మృణాళిని ఠాకూర్ నటించబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత చిరంజీవి మరో మళయాళం రీమేక్ సినిమా చేయబోతున్నారు. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ల సొంత బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో దీనిని నిర్మించబోతున్నారు. నాగార్జునకు ‘బంగార్రాజు’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన కృష్ణ కురసాల ఈ రీమేక్ సినిమాకు దర్శకత్వం చేయబోతున్నారు.