విశ్వంభరలో భీమవరం దొరబాబుగా చిరంజీవి?

November 22, 2023


img

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాని ‘బింబిసార’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు మల్లాది వశిష్టతో చేయబోతున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబుగా నటించబోతున్నట్లు తాజా సమాచారం. ఈ కధ భీమవరంలో మొదలవుతుందట. అక్కడ దొరబాబుగా చాలా ఫేమస్ అయిన చిరంజీవితో వశిష్ట మంచి కామెడీ కూడా చేయించబోతున్నట్లు తెలుస్తోంది.

శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకి కధ కంటే చిరంజీవి కామెడీ టైమింగే పెద్ద అట్రాక్షన్‌గా నిలిచింది. కనుక చిరంజీవిలో ఆ కోణాన్ని పూర్తిగా వాడేసుకోవాలని దర్శకుడు వశిష్ట ఫిక్స్ అయ్యాడట! సోషియో ఫాంటసీ సినిమాకి చిరంజీవి కామెడీ కలిస్తే అది ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ వంటి హిట్ అవుతుందని వేరే చెప్పక్కరలేదు. 

విశ్వంభర సినిమాని యూవీ క్రియెషన్స్ పతాకంపై విక్రమ్, వక్కంతం వంశీ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించబోతున్నారు. నవంబర్‌ నెలాఖరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా పూర్తవడానికి 4-5 నెలలు సమయం పడుతుందనుకొంటే వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది.


Related Post

సినిమా స‌మీక్ష