నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘తండేల్’ అనే టైటిల్ ఖరారు చేసి, గురువారం నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్-లుక్ పోస్టర్ కూడా ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమాలో నాగ చైతన్య చేపలు పట్టే మత్స్యకారుడుగా నటిస్తున్నాడు.
ఫస్ట్-లుక్ పోస్టర్‌లో “కాలంతో, కెరటాలతో పోటీ పడుతూ తన ప్రజలను రక్షించుకొనే ఓ నాయకుడు పుట్టాడు,” అంటూ చిన్న క్యాప్షన్ ఇచ్చి కధ, దానిలో హీరో పాత్ర ఏమిటో క్లూ ఇచ్చింది గీతా ఆర్ట్స్.
నాగ చైతన్యకు 23వ సినిమాగా వస్తున్న తండేల్‌కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దీనిని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి నిర్మిస్తున్నారు.