త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి విడుదలైన మొదటి పాట ‘దమ్ మసాలా’కు అందరినీ ఆకట్టుకొంది. ఇప్పుడు రెండో పాట కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని గురించి నిర్మాత నాగవంశీ ఆదికేశవ ట్రైలర్ రిలీజ్ వేడుకలో ప్రకటన చేశారు. వచ్చే వారం గుంటూరు కారం రెండో పాట విడుదల చేయబోతున్నామని ప్రకటించారు.
గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, రమ్య కృష్ణ, జగపతి బాబు, జయరాం, బ్రహ్మానందం, సునీల్, రఘుబాబు, మహేష్ ఆచంట తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాను రూ.200 కోట్ల బడ్జెట్‌తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది.