మాస్ మహారాజ రవితేజ ప్రధానపాత్రలో వస్తున్న టైగర్ నాగేశ్వర రావు సినిమాలో ప్రముఖ నటుడు నాజర్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారని తెలుసు కానీ అదేమిటో ఇంతవరకు ఎవరికీ తెలియదు. కొద్ది సేపటి క్రితం ఈ సినిమాలో ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌ని అభిషేక్ పిక్చర్స్ విడుదల చేసింది. దానిలో ఆయన పాత్ర పేరు ‘గజ్జల ప్రసాద్’ అని చెపుతూ, స్టువర్టుపురానికి వెన్నెముక వంటివాడని పరిచయం చేసింది. ఫస్ట్-లుక్ పోస్టర్‌లో ఆయన అచ్చం బందిపోటు దొంగలాగే చాలా భయంకరంగా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ మంగళవారం ముంబయిలో విడుదల చేయబోతున్నట్లు అభిషేక్ పిక్చర్స్ తెలియజేసింది.
గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత కధ ఆధారంగా తీస్తున్న ఈ చిత్రానికి వంశీ దర్శకుడు. ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. నుపూర్ సనన్, అనుపమ్ ఖేర్, నాజర్, మురళీ శర్మ, జిషు సేన్ గుప్తా, సుదేవ్ నాయర్, హరీష్ పేరడీ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత రేణూ దేశాయ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆనాటి ప్రముఖ సామాజికవేత్త హేమలత లవణం పాత్రను ఆమె చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వంశీ, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: మాధే, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు, కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్ చేస్తున్నారు.
ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్‌లో ఇదే తొలి పాన్ ఇండియా మూవీ. తెలుగు, తమిళ, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో నిర్మించిన టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న విడుదల కాబోతోంది.