‘కుమారి శ్రీమతి’ ట్రైలర్‌ బాగుంది కానీ...

September 23, 2023


img

నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటించిన ‘కుమారి శ్రీమతి’ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది. దీనికి శ్రీనివాస్ అవసరాల కధ అందించగా గోమటేశ్ ఉపాధ్యాయ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ చాలా ఆకట్టుకొంది.

నిన్న విడుదల చేసిన ట్రైలర్‌ కూడా చాలా ఆకట్టుకొంది. ఓ గ్రామంలో నివశిస్తున్న మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీమతి (నిత్యామీనన్) అనే పేరుగల ఓ పెళ్ళికాని అమ్మాయి తన కుటుంబాన్ని, వారసత్వంగా వచ్చిన ఇంటిని కాపాడుకొనేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేసిందనేది ఈ వెబ్‌ సిరీస్‌ కధాంశంగా ట్రైలర్‌ చూస్తే అర్దమవుతోంది. కధ లైన్ చిన్నది కనుక స్క్రీన్ ప్లే చాలా కీలకం కాబోతోంది. అది బాగుంటేనే ఈ వెబ్‌ సిరీస్‌ అందరినీ ఆకట్టుకోగలుగుతుంది.   

ఈ వెబ్‌ సిరీస్‌లో నిత్యా మీనన్, గౌతమి, తాళ్ళూరి రామేశ్వరి, ప్రేమ్ సాగర్, ప్రణీత పట్నాయక్, డాక్టర్ విజయ కృష్ణ నరేశ్, లక్ష్మి వెన్నెల్ల, ఉషశ్రీ, గవిడిరెడ్డి శ్రీనివాస్, అక్ష్య లుంగుసాని,మహేశ్ ఆచంట, మాధవీలత, సుబ్బరాయ శర్మ, రామ్, లక్ష్మణ్, శ్రీవాణి, వేణు పొలసాని , నిరుపమ్ పరిటాల, తిరువీర్ నటిస్తున్నారు. 

ఈ వెబ్‌ సిరీస్‌కు స్క్రీన్ ప్లే, డైలాగ్స్: అవసరాల, కధ: బలబద్రపాత్రుని రమణి, మల్లిక్ రామ్, సంగీతం: స్టాకటో, కమ్రాన్, కెమెరా: మోహన్ కృష్ణ, ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి చేస్తున్నారు.       

కుమారి శ్రీమతి వెబ్‌ సిరీస్‌ తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి ఈనెల 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఇటువంటి వెబ్‌ సిరీస్‌ నిర్మాణం కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఎర్లీ మాన్‌సూన్ టేల్స్’ ద్వారా దీనిని నిర్మిస్తోంది.Related Post

సినిమా స‌మీక్ష