హైనాన్న... సమయమా లిరికల్ సాంగ్ వచ్చేసింది

September 16, 2023


img

నూతన దర్శకుడు శౌర్యూవ్‌ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమా నుంచి శనివారం సమాయమా.. అంటూ మృదుమధురంగా సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది.

అనంత్ శ్రీరామ్ వ్రాసిన ఈ రొమాంటిక్ పాటను    హెషమ్ అబ్దుల్ వాహేబ్ అద్భుతంగా స్వరపరచి చక్కటి సంగీతం అందించగా, అనురాగ్ కులకర్ణి, సితార కృష్ణ కుమార్‌ మృదుమధురంగా ఆలపించారు. నాని-మృణాళిని ఠాకూర్ మద్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరిన్నట్లే ఉంది. ఈ పాటలో గ్రాఫిక్స్‌ కూడా చాలా బాగున్నాయి. ఇది నాని మార్క్ మంచి రొమాంటిక్ సినిమా కనుక మినిమం గ్యారెంటీ ఉంటుంది.  ఈ సినిమా డిసెంబర్‌ 21న విడుదలకాబోతోంది.

ఈ సినిమాలో నాని కూతురుగా బాలీవుడ్ బాలనటి కియరా ఖన్నా నటించింది. ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల కలిసి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: హేషం అబ్దుల్ వాహేబ్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: ప్రవీణ్ ఆంథోని, కొరియోగ్రఫీ: బోస్కో మార్టిస్, స్టంట్స్: విజయ్‌, పృధ్వీ. Related Post

సినిమా స‌మీక్ష