ఆర్‌ఆర్‌ఆర్‌కు మళ్ళీ 5 అవార్డులు... ఈసారి దుబాయ్‌లో

September 16, 2023


img

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్-2023 కార్యక్రమం శుక్రవారం రాత్రి దుబాయ్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు మళ్ళీ అవార్డుల పంట పండింది. ఈ సినిమాకు ఉత్తమ నటుడు (జూ.ఎన్టీఆర్), ఉత్తమ దర్శకుడు (రాజమౌళి), ఉత్తమ సంగీత దర్శకుడు (ఎంఎం కీరవాణి), ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ (కెకె సెంథిల్ కుమార్‌), ఉత్తమ గీత రచయిత (చంద్రబోస్) అవార్డులు అందుకొన్నారు. 

సైమా-2023 అవార్డులు అందుకొన్నవారు: 

ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా), ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతీ మూవీస్), ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్), ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద), ఉత్తమ విలన్‌: సుహాస్ (హిట్ 2), ఉత్తమ హాస్యనటుడు: శ్రీనివాస్ రెడ్డి (కార్తికేయ 2) ఉత్తమ నేపద్య గాయకుడు: రామ్ మిర్యాల (డిజే టిల్లు)

ఉత్తమ పరిచయ నిర్మాత: శరత్ (మేజర్), ఉత్తమ పరిచయ నటి: మృణాల్ ఠాకూర్, ఉత్తమ పరిచయ దర్శకుడు: వశిష్ట (బింబిసార)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడవి శేష్ (మేజర్), ఉత్తమ నటి(క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్ (సీతారామం)

ఫ్లిప్ కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్: శ్రుతీ హాసన్, ప్రామిసింగ్ న్యూకమర్: బెల్లంకొండ గణేశ్ 

సెన్సేషన్ ఆఫ్ డి ఇయర్: నిఖిల్ (కార్తికేయ 2).


Related Post

సినిమా స‌మీక్ష