గంగం గణేశా టీజర్‌ ... ఆనంద్ చెడ్డ పిల్లోడైపోయాడే?

September 16, 2023


img

ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం గంగం గణేశా టీజర్‌ వచ్చేసింది. మిడిల్ క్లాస్ మెలోడీస్, బేబీ వంటి సినిమాలతో ఇంతవరకు పక్కింటి కుర్రాడు తరహా పాత్రలలో నటించి మెప్పిస్తున్న ఆనంద్ ఈ సినిమాలో కాస్త చెడ్డ పిల్లోడుగా మారిపోయి కొత్తగా ప్రయత్నిస్తున్నట్లు టీజర్‌ చూస్తే అర్దమవుతుంది. సినిమా పేరు కూడా వెరైటీగానే ఉంది. టీజర్‌ చూస్తే ఇదో చక్కటి క్రైమ్ కామెడీ సినిమా అనిపిస్తోంది కనుక ఆనంద్ దీంతో మరో హిట్ కొట్టబోతున్నట్లే ఉన్నాడు.   

ఉదయ్ బొమ్మిశెట్టి ధర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఆనంద్‌కు జంటగా ప్రగతి శ్రీవాత్సవ నటిస్తోంది. నయన్ సారిక, ఇమ్మానుయెల్, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: ఆదిత్య జువ్వాది, కొరియోగ్రఫీ: పోలాకి విజయ్, స్టంట్స్‌: నభ, అంజి, ఆర్ట్: కింద మామిడి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష