హాయ్ నాన్న... సమయమా సాంగ్ రేపు విడుదల

September 15, 2023


img

నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. శనివారం ఉదయం 11.07 గంటలకు సమాయమా.. అంటూ సాగే తొలి లిరికాల వీడియో సాంగ్ విడుదల చేయబోతునట్లు నాని స్వయంగా ట్వీట్ చేశారు.


ఇది తండ్రీ కూతుర్ల సెంటిమెంట్‌తో తీస్తున్నప్పటికీ, నాని-మృణాల్ రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుందని తొలి సాంగ్ ప్రమోతోనే అర్దమవుతోంది. ఈ సినిమాలో హీరో (నాని)మొదటి భార్య చనిపోవడమో, విడిపోవడమో జరుగుతుంది. అప్పుడు కూతురు (కియరా ఖన్నా)తో ఒంటరి జీవితం గడుపుతుండగా హీరోయిన్ (మృణాళిని ఠాకూర్) పరిచయం, ప్రేమ తర్వాత వారి ముగ్గురు మద్య రిలేషన్స్ ఏవిదంగా ఉంటాయనే కధాంశంగా తెలుస్తోంది. 

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల కలిసి ఈ ‘హాయ్ నాన్న’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో శౌర్యూవ్‌ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం: హేషం అబ్దుల్ వాహేబ్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: ప్రవీణ్ ఆంథోని, కొరియోగ్రఫీ: బోస్కో మార్టిస్, స్టంట్స్: విజయ్‌, పృధ్వీ. 

ఈ సినిమా డిసెంబర్‌ 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకాబోతోంది.Related Post

సినిమా స‌మీక్ష