ఇంతకీ డెవిల్ దర్శకుడు ఎవరో?

September 15, 2023


img

నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన డెవిల్-ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమా నవంబర్‌ 24న విడుదల కాబోతోంది. ఈనెల 19న ఈ సినిమాలోని మొదటి సాంగ్ ప్రమో విడుదల చేస్తామని తెలియజేస్తూ అభిషేక్ పిక్చర్స్ ఓ పోస్టర్ విడుదల చేసింది.

అయితే దానిలో నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామా అని వేయడంతో నవీన్ మేడారం షాక్ అయ్యారు. పొరపాటున నవీన్ పేరుకు బదులు అభిషేక్ పేరు ముద్రించబడి ఉంటే ఆ విషయం వెంటనే ట్వట్టర్ ద్వారానే తెలియజేస్తూ మరో పోస్టర్ విడుదల చేసి ఉండేవారు. కానీ అభిషేక్ పిక్చర్స్ అటువంటి ప్రయత్నమేదీ చేయకపోవడంతో ఉద్దేశ్యపూర్వకంగానే నవీన్ మేడారంను పక్కన పెట్టిన్నట్లు స్పష్టమవుతోంది.

నవీన్ మేడారం దర్శకత్వంలోనే డెవిల్ సినిమా పూర్తయిన తర్వాత అతని పేరును తొలగించి నిర్మాత అభిషేక్ నామా తన పేరు ఎందుకు వేసుకొన్నారో?అసలు వారిద్దరి మద్య ఈ వివాదం ఏమిటో ఇంకా తెలియవలసి ఉంది. 

నిర్మాత అభిషేక్ నామా స్పందించకపోవడంతో నవీన్ మేడారం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘వినాశకాలే విపరీతబుద్ధి’ అని చిన్న సందేశం పెట్టాడు. అయితే ఎవరిని ట్యాగ్ చేయకపోవడంతో అది డెవిల్ సినీ నిర్మాత అభిషేక్ నామాను ఉద్దేశయించి చేసినదిగానే భావించవచ్చు. 


Related Post

సినిమా స‌మీక్ష