ఓజీ... ఫస్ట్ గ్లింప్స్‌ చూశారా? అద్దిరిపోయింది

September 02, 2023


img

ఈరోజు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ సినిమా నుంచి ‘హంగ్రీ చీతా’ పేరుతో ఫస్ట్ గ్లింప్స్‌ విడుదలచేశారు. “పదేళ్ళ క్రితం ముంబాయిలో వచ్చిన తుఫాను భీభత్సం కంటే ‘ఓజీ’ చేసిన రక్తపాతమే ఎక్కువగా ఉందంటూ..” పవన్‌ కళ్యాణ్‌ని దర్శకుడు చూపినతీరు చూసి అభిమానులు పొంగిపోతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ వీరాభిమానులలో దర్శకుడు సుజీత్ కూడా ఒకరు. అందుకే పవన్‌ కళ్యాణ్‌ను ఓజీలో అంత గొప్పగా చూపిన్నట్లు అర్దమవుతోంది. ఈ ఫస్ట్ గ్లింప్స్‌ గురించి మాటలలో వివరించడం కంటే నేరుగా తెర మీద చూస్తేనే బాగుంటుంది. 

ఈ యాక్షన్ ప్యాక్ మూవీలో గ్యాంగ్ స్టర్‌గా నటిస్తున్న పవన్‌ కళ్యాణ్‌కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్, ముఖ్యపాత్రలలో శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్‌, అర్జున్ దాస్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. 

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య చాలా బారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: వజీద్ బేగ్ అందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.


నేడు పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా క్రిష్ దర్శకత్వంలో సిద్దమవుతున్న హరిహర వీరమల్లు సినిమా పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీనిలో పవన్‌ కళ్యాణ్‌ వేరే గెటప్‌లో చూపారు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్‌ నటులు నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా 2023, మార్చిలో విడుదలకాబోతోంది.