ఈ ఒక్క పాట చాలు... విమానం ఎక్కడానికి

May 22, 2023


img

తమిళ నటుడు సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ తండ్రీకొడుకులుగా శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో వస్తున్న సినిమా పేరు విమానం. జూన్ 9న విడుదల కాబోతున్న ఈ సినిమాలో అందాల అనసూయ, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాలో సుమతిగా నటిస్తున్న అనసూయ అందాలను వర్ణిస్తూ రాహుల్ రామకృష్ణ కోసం చరణ్ అర్జున్ పాడిన లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. నిరుపేద తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో అల్లుకొన్న ఈ సినిమాలో ప్రేక్షకులను రంజింపజేసేందుకు, అనసూయ, రాహుల్ రామకృష్ణల రొమాన్స్ సరిపోతుందని ఈ ఒక్క పాటతో అర్దమవుతోంది. తేటతెలుగు పదాలతో "సుమతీ.... కొత్త చెప్పులెక్క నన్ను కరవమాకే..." అంటూ సాగే పాట చాలా అద్భుతంగా ఉంది. ఇక అనసూయని ‘ఆంటీ’ అనే వాళ్ళకి ఆ కొత్త చెప్పుతో కొట్టిన్నట్లుగా దీనిలో అందాలు ఆరబోసింది. ఈ ఒక్క పాట చాలు విమానం చక్కగా టేకాఫ్ అవడానికి! 

 జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి కలిసి తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంగీతం: డైలాగ్స్: హను రావూరి,  ఎడిటర్: మార్తాండ్ వెంకటేష్, సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: వివేక్ కాలెపు. విమానం జూన్ 9వ తేదీన థియేటర్లలో ల్యాండ్ అవ్వబోతోంది.

     Related Post

సినిమా స‌మీక్ష