రామ్ చరణ్‌-శంకర్ సినిమా టైటిల్‌ గేమ్ ఛేంజర్

March 27, 2023


img

మెగా పవర్ స్టార్  రామ్ చరణ్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఎస్.శంకర్ దర్శకత్వం తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌ ‘గేమ్ ఛేంజర్’ అని ప్రకటించారు. దీనికి సంబందించి అద్భుతమైన గ్రాఫిక్ వీడియోని కూడా నేడు విడుదల చేశారు. క్యాసినోలో జూదం ఆడేందుకు తిరిగే చక్రాన్ని మొదట చూపిస్తూ, దానిని పార్లమెంటు భవనంలాగ మార్చి చూపారు. మద్యలో కింగ్ చుట్టూ ప్రజాప్రతినిధులున్నట్లు చూపారు. జూదంలా సాగుతున్న రాజకీయాలలో కింగ్ రాకతో ‘గేమ్ ఛేంజ్’ అయ్యిందని సూచిస్తున్నట్లు ఆ వీడియో ఉంది.

ఈ సినిమాలో రామ్ చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే మొదట విశాఖలో ఆ తర్వాత కర్నూలులో కొండారెడ్డి బురుజు వద్ద రాజకీయ సభలు నిర్వహిస్తున్న సన్నివేశాలను షూట్ చేశారు. 

గేమ్ చెంజర్ సినిమాలో రామ్ చరణ్‌, కియరా అద్వానీ, అంజలి ప్రధాన పాత్రలు చేస్తుండగా, ఎస్ జే సూర్య, సునీల్, నాజర్, రఘుబాబు, జయరాం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు, అల్లు శిరీష్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కధ: కార్తీక్ సుబ్బరాజు, కెమెరా తిరు, ఆర్‌ రత్నవేలు, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది వేసవి సెలవులలో గేమ్ ఛేంజర్ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. 
Related Post

సినిమా స‌మీక్ష