నితిన్ మరో సినిమాకి కొబ్బరికాయ కొట్టేశాడుగా

March 25, 2023


img

మాచర్ల నియోజకవర్గంపై నితిన్ గంపెడాశలు పెట్టుకొన్నప్పటికీ అది పెద్దగా ఆడకపోవడంతో నిరాశ చెందినప్పటికీ, దాని కోసం చింతిస్తూ కూర్చోకుండా వక్కంతం వంశీ డైరెక్షంలో ఓ సినిమా మొదలుపెట్టేశాడు. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాకు సైతాన్ అని టైటిల్‌ ఖరారు చేసిన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఈనెల 30న నితిన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్-లుక్‌ పోస్టర్‌ను విడుదలచేయబోతున్నారు. 

పూర్తయ్యేలోగా నితిన్‌ శుక్రవారం మరో సినిమాకి కొబ్బరికాయ కొట్టేశాడు. ఇది నితిన్‌-రష్మిక-వెంకీ కుడుముల భీష్మ హిట్ కాంబినేషన్‌తో తెరకెక్కబోతోంది. హైదరాబాద్‌లో శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముహూర్తపు అమిత్‌ షాట్‌కి క్లాప్ కొట్టగా దర్శకుడు బాబీ కెమెరా స్విచ్ ఆన్‌ చేసారు. గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకులు హను రాఘవపూడి, బుచ్చిబాబు చిత్రబృందానికి స్క్రిప్ట్ అందజేసి అభినందనలు తెలియజేశారు. 

ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్న ఈ సినిమాకు సంగీతం: జీవి ప్రకాశ్ కుమార్, కెమెరా: సాయి శ్రీరామ్, ఎడిటింగ్: ప్రవీణ్‌ పూడి చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాలో మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ పేర్లను ప్రకటిస్తామని దర్శకుడు వెంకీ కుడుముల తెలిపారు.   
Related Post

సినిమా స‌మీక్ష