నరేష్‌, పవిత్రా లోకేష్‌ మళ్ళీ పెళ్ళి!

March 24, 2023


img

సీనియర్ నరేష్‌, పవిత్రా లోకేష్‌ ప్రేమ, సహజీవనం గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల వారిద్దరూ రహస్యంగా పెళ్ళి చేసుకొని హనీమూన్‌కి దుబాయ్ వెళ్ళిన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వారిద్దరూ నటించిన ‘మళ్ళీ పెళ్ళి’ అనే సినిమాలో వారు తమ పెళ్ళి ముచ్చట తీర్చుకొన్నట్లు తాజాగా విడుదల చేసిన ఫస్ట్-లుక్‌ వీడియోని చూస్తే అర్దమవుతుంది. 

ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరేష్‌, పవిత్రా లోకేష్‌ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా, జయసుధ, శరత్ బాబు, వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ళ, రోశన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్‌ యండమూరి, మధు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం, ఎంఎన్ బాల్ రెడ్డి కెమెరా, జనైద్ సిద్దిఖీ ఎడిటింగ్ బాధ్యతలు చేస్తున్నారు. 

ఈ మళ్ళీ పెళ్ళి సినిమాను విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్‌ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా వేసవిలో విడుదల కాబోతున్నట్లు ఫస్ట్-లుక్‌ వీడియోలో తెలియజేశారు.

    Related Post

సినిమా స‌మీక్ష