అఖిల్ ఏజంట్ సినిమాకి మరో రిలీజ్‌ డేట్ ఏప్రిల్ 14?

February 02, 2023


img

అక్కినేని అఖిల్ ఇంతవరకు నాలుగు సినిమాలు చేశాడు కానీ ఒక్కటీ హిట్ అవలేదు. వాటి తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజంట్ అనే యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్‌కి జోడీగా సాక్షి వైద్య నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మమ్మూట్టి ప్రధాన పాత్ర చేస్తున్నారు. దీనిలో అఖిల్ అండర్ కవర్ ఏజంట్‌గా చేస్తున్నాడు.   

ఈ సినిమా గత ఏడాది ఆగస్ట్ 12న విడుదల చేయాలనుకొన్నారు కానీ తర్వాత ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి వాయిదా వేశారు. అప్పుడు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రిలీజ్‌ అవుతుండటంతో మళ్ళీ ఏప్రిల్ 14కి వాయిదా వేసుకొన్నారు. త్వరలోనే రిలీజ్‌ డేట్ అధికారకంగా ప్రకటించనున్నారు. అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి కలిసి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సరెండర్-2 తమ సొంత బ్యానర్లపై తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కధ: వక్కంతం వంశీ, సంగీతం: థమన్, కెమెరా: రాగూల్ హెరియన్ ధారూమాన్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్టిస్ట్‌: అవినాష్ కొల్లా చేస్తున్నారు.   Related Post

సినిమా స‌మీక్ష