సీనియర్ సినిమాటోగ్రాఫర్ దేవరాజ్‌కి చిరంజీవి ఆర్ధికసాయం

February 02, 2023


img

సినిమాలలో మెగాస్టార్ అనిపించుకొన్న చిరంజీవి నిజజీవితంలో కూడా రియల్ హీరో అనే విషయం అందరికీ తెలిసిందే. ఆర్ధిక సమస్యలలో చిక్కుకొన్న సీనియర్ సినిమాటోగ్రాఫర్ దేవరాజ్‌కి చిరంజీవి రూ.5 లక్షల ఆర్ధికసాయం చేశారు. ఆనాటి ఏఎన్నార్, ఎన్టీఆర్‌, ఎంజీఆర్ మొదలు రాజనీకాంత్, చిరంజీవి, కృష్ణంరాజు, నాగార్జున వరకు అనేకమంది పెద్ద హీరోల సినిమాలకి దేవరాజ్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, బెంగాలీ భాషల్లో సుమారు 300కి పైగా సినిమాలకి దేవరాజ్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. చిరంజీవి నటించిన రాణికాసుల రంగమ్మ, పులిబెబ్బులి, నాగు తదితర సినిమాలకి దేవరాజ్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

అన్ని సినిమాలు చేసినప్పటికీ, వివిద కారణాల చేత ఆర్ధిక సమస్యలలో చిక్కుకొని వృద్ధాప్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకొన్న చిరంజీవి ఆయన కుమారుడుకి ఫోన్‌ చేయగా అతను తండ్రిని వెంటబెట్టుకొని ఈరోజు చిరంజీవి ఇంటికి వచ్చారు. చిరంజీవి ఆయనని సాధారంగా ఆహ్వానించి పలకరించి ఆయన ఆర్ధిక, ఆరోగ్య పరిస్తితి గురించి అడిగితెలుసుకొన్నారు. తర్వాత ఆయనకి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. ఈ విషయం చిరంజీవి అభిమానులు సోషల్ మీడియాలో బయటపెట్టడంతో చిరంజీవి దాతృత్వం గురించి అందరికీ తెలిసింది.        Related Post

సినిమా స‌మీక్ష