వైద్యులు సకాలంలో చికిత్స అందించారు గాబట్టి... ఇలియానా

January 31, 2023


img

గోవా బ్యూటీ ఇలియానా అనారోగ్యంపాలై ముంబైలో హాస్పిటల్‌ చేరి చికిత్స తీసుకొంటున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మెసేజ్, దాంతో పాటు తన తాజా సెల్ఫీ ఫోటోని పోస్ట్ చేసింది. వైద్యులు సకాలంలో మంచి వైద్యం అందించి సెలైన్ పెట్టారు. ఒక్కరోజులో నా ఆరోగ్యం చాలా మెరుగుపడింది. నా ఆరోగ్యం గురించి అడుగుతూ చాలా మంది సందేశాలు పెడుతున్నారు. మీ అందరి ప్రేమని పొందుతున్నందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని,” అని ఇలియానా అభిమానులు అందరికీ కలిపి జవాబు ఇచ్చింది. 

ఇంతకీ తన ఆరోగ్య సమస్య ఏమిటో చెప్పనేలేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన తన ఫోటోని చూస్తే ఏదో పెద్ద ఆరోగ్య సమస్యనే ఎదుర్కొంటున్నట్లు అర్దం అవుతోంది. 

ఇలియానా దేవదాసు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించి అందరూ పెద్ద హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్‌ స్టేటస్ అందుకొంది. ఆమె ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్ర్యూ నీబోన్‌తో కొంతకాలం సహజీవనం చేసి పెళ్లి చేసుకొంది. కానీ 2019లో అతనితో విడిపోయిన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ హిందీ సినిమాలలో నటించడం ప్రారంభించింది. ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’ అనే హిందీ సినిమాని ఇటీవలే ఇలియానా పూర్తి చేసింది. 


Related Post

సినిమా స‌మీక్ష