కస్టడీలో నాగ చైతన్య!

November 23, 2022


img

అవును ప్రముఖ నటుడు అక్కినేని నాగ చైతన్యను పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. అయితే నిజ జీవితంలో కాదు సినిమాలో! ఇవాళ్ళ నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా నాగ చైతన్య 22వ చిత్రం టైటిల్‌ ప్రకటించారు. 

వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య చేస్తున్న సినిమా టైటిల్‌ ‘కస్టడీ’ అని కొద్ది సేపటి క్రితం ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ సందర్భంగా టైటిల్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దానిలో నాగచైతన్యకు పోలీసులు తుపాకులు గురిపెట్టి బందించి పట్టుకొన్నట్లు చూపారు. నాగ చైతన్య ఖాకీ చొక్కా ధరించినట్లు చూపారు. ఈ సినిమాలో ఏ.శివ అనే పోలీస్ అధికారిగా నాగ చైతన్య నటిస్తున్నట్లు పోస్టర్‌ని బట్టి అర్దమవుతుంది. వెనక గోడ మీద గాంధీజీ ఫోటో దాని కింద “ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకొన్న మార్పు నీతోనే మొదలవ్వాలి,” అనే కొటేషన్ కనిపిస్తుంటుంది. అంటే పోలీస్ శాఖలో పనిచేస్తున్న నాగ చైతన్య సమాజంలో ఏదో మార్పు కోసం చేస్తున్న పోరాటంలో అతనినే నేరస్థుడని బందించినట్లు చూపారు.    కానీ పోలీసులు తుపాకులు గురిపెట్టి బందించి పట్టుకొన్నా పొగరుగా చూస్తున్న నాగచైతన్య పోస్టర్‌ చాలా ఆకట్టుకొంటోంది. 

ఈ సినిమాలో నాగ చైతన్యకి జోడీగా కృతీ శెట్టి నటిస్తోంది. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రేమ్ విశ్వనాథ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

తెలుగు, తమిళ్ భాషలలో శ్రీనివాససిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై చిత్తూరి శ్రీను ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 30వ తేదీన విడుదల చేయబోతున్నారు.

   

   Related Post

సినిమా స‌మీక్ష