బన్నీ వాసు నన్ను మోసం చేశాడు: సునీత బోయ

November 18, 2022


img

నిర్మాత బన్నీ వాసు తనని మోసం చేశాదంటూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ మళ్ళీ గురువారం రాత్రి గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట నగ్నంగా ధర్నా చేసింది. ఆమె 2019 నుంచి ఇప్పటివరకు సుమారు 25 సార్లు ఇదేవిదంగా గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు ధర్నాలు చేసింది. ఓ సినిమాలో నటించిన తనకు బన్నీ వాసు ఆ పారితోషికం చెల్లించకుండా ఎగవేశారని, తన తదుపరి సినిమాలలో అవకాశాలు ఇస్తానని చెప్పి మోసం చేశారని సునీత బోయ ఆరోపిస్తోంది. 

ఆమె పదేపదే గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు అర్ధనగ్నంగా, నగ్నంగా ధర్నాలు చేస్తుండటంతో గీతా ఆర్ట్స్ సంస్థ ఫిర్యాదు మేరకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేవారు. ఈవిదంగా ఆమెను 5-6 సార్లు పోలీసు అరెస్ట్ చేషారు. ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని గ్రహించిన న్యాయమూర్తి ఆమెను ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చేర్పించి చికిత్స అందించాలని ఆదేశించారు. కోర్టు ఆదేశం మేరకు పోలీసులు ఆమెను హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స చేయించారు. కోలుకొన్న తర్వాత ఆమెను తల్లితండ్రులకి అప్పగించారు. 

కానీ ఆమె మళ్ళీ నిన్న రాత్రి గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట నగ్నంగా ధర్నా చేయడంతో పోలీసులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ప్రస్తుతం బన్నీ వాసు వేరే ఊర్లో ఉన్నారని ఆయన వచ్చాక మాట్లాడి డబ్బు ఇప్పిస్తామని నచ్చజెప్పి ఆమెను మళ్ళీ తల్లితండ్రులకు అప్పగించారు.     Related Post

సినిమా స‌మీక్ష