తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు వచ్చేశాయి

September 28, 2025


img

తెలంగాణలో గ్రూప్-2లో 782 పోస్టుల భర్తీకి సంబంధించి ఫలితాలు టిజిపీఎస్సీ ఈరోజు (ఆదివారం) మధ్యాహ్నం ప్రకటించింది. గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేసింది. కనుక ఆలస్యం చేయకుండా వెంటనే నేడు గ్రూప్-2 ఫలితాలు కూడా ప్రకటించేసింది. ఫలితాలను టిజిపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌  www.tgpsc.gov.in లో చూసుకోవచ్చు. 

ఈ ఏడాది మార్చిలో టిజిపీఎస్సీ జనరల్ ర్యాంకులు ప్రకటించింది. వాటిలో అర్హత సాధించిన వారి ద్రువపత్రాల పరిశీలన కూడా పూర్తి చేసింది. యూనిఫారం పోస్టుల అభ్యర్ధులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించింది.

జనరల్ ర్యాంకింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్ధుల విద్యార్హతలు, మెరిట్ ర్యాంక్, రిజర్వేషన్లు ఆధారంగా నేడు ఈ ఫలితాలు ప్రకటించింది. దసరా పండగ (అక్టోబర్ 2)లోగా గ్రూప్-1, 2 ఎంపికైన అభ్యర్ధులకు నియామక పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


Related Post