హైదరాబాద్‌ సీపీగా వీసీ సజ్జనార్‌ బదిలీ

September 27, 2025


img

చాలాకాలంగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీగా చేస్తున్న సీనియర్ ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ మళ్ళీ పోలీస్ శాఖలోకి బదిలీ అయ్యారు. ఆయనని హైదరాబాద్‌ పోలీస్ కమీషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నాగిరెడ్డిని ఆర్టీసీ నియమించింది. 

తెలంగాణ ప్రభుత్వం గురువారం మొత్తం 23 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఇంతవరకు హైదరాబాద్‌ సీపీగా చేస్తున్న సీవీ ఆనంద్‌ని రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. సీఐడీ అదనపు డీజీగా ఉన్న చారుసిన్హాకు ఏసీబీ డీజీగా, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా స్వాతీ లక్రా అదనపు బాధ్యతలు అప్పగించింది. 

ఇంటలిజెన్స్ డీజీ: విజయ్ కుమార్‌, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ, సైబర్ సెక్యూరిటీ బ్యూర్ డైరక్టర్: శిఖా గోయల్, సీఐడీ చీఫ్: వీవీ ఆనంద రావు, రాజన్న సిరిసిల్ల కలెక్టర్: హరిత, ప్రత్యేక కార్యదర్శి: సందీప్ కుమార్‌ ఝా, ఫైర్ అండ్ సేఫ్టీ డీజీ: విక్రం సింగ్ మాన్, పౌర సరఫరాల ముఖ్య కార్యదర్శి: స్టీఫెన్ రవీంద్రని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 


Related Post