అరుదైన ఫోటో: ఎకానమీ క్లాసులో జగన్‌ దంపతులు

August 14, 2024


img

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దంపతుల ఓ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది వారి పెళ్ళి ఫోటో లేదా మరొకటి కాదు. ఇటీవల ఇద్దరూ కలిసి విమానంలో ఎకానమీ క్లాసులో బెంగళూరుకి వెళుతున్నప్పుడు ఎవరో తీసిన ఫోటో.

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఢిల్లీ వెళ్ళాలన్నా ప్రత్యేక విమానాలలోనే వెళ్ళివస్తుండేవారు. ఇక విదేశీ యాత్రలకు బయలుదేరితే గంటకు లక్షల రూపాయల అద్దెతో ప్రత్యేక విమానంలోనే వెళ్ళి వచ్చేవారు. అధికారంలో ఉండగా ప్రత్యేక విమానాలలో ప్రయాణాలకు కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసిన జగన్‌, ఇప్పుడు అధికారం కోల్పోగానే సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తుండటం చూసినవారు ఆశ్చర్యపోతున్నారు. 

కనీసం బిజినెస్ క్లాసు టికెట్‌ కొనుక్కోవచ్చు కదా? వందలు వేల కోట్ల ప్రజాధనం దుబారా చేయడానికి వెనుకాదని జగన్‌కి మరి ఇంత పిసినారితనమా?సొంత డబ్బు ఖర్చు చేయాలంటే మనసొప్పదు. రేపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే అదీ వాడేసుకుంటారేమో? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 


Related Post