తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో 607 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసస్ రిక్రూట్‌అపాయింట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో వివిద ప్రభుత్వాసుపత్రులకు అనుబందంగా ఉన్న వైద్య కళాశాలలో గల ఈ ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగాలకు తగిన అనుభవం, అర్హత ఉన్నవారు జూలై 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
గత 17 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా గల ప్రభుత్వాసుపత్రులలో 8000కి పైగా పోస్టులు భర్తీ చేసింది. రెండు రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇవి కాక 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 1,931 మల్టీ పర్పస్ ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్లు, 1,284 ల్యాబ్‌కు టెక్నీషియన్స్, 732 మంది ఫార్మాసిస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. వాటికి అదనంగా నేడు మరో 607 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం, ప్రజారోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్దకి నిదర్శనంగా భావించవచ్చు.