టిజిఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్, వరంగల్ నగరాలలో నడుస్తున్న ఐటిఐలలో వివిద కోర్సులలో 2025-26 సంవత్సరంలకుగాను ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనయర్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, వెల్డర్, పెయింటర్, తదితర కోర్సులలో శిక్షణ పొందవచ్చు. శిక్షణ పూర్తయిన తర్వాత టిజిఎస్ ఆర్టీసీలోనే ఏడాదిపాటు అప్రెంటిస్ శిక్షణకి కూడా అర్హత లభిస్తుంది. ఈ కోర్సులలో ప్రవేశాలకు కనీసం 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఐటిఐ, అప్రెంటిస్ శిక్షణ పూర్తిచేసిన వారికి టిజిఎస్ ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించదు. కానీ ఖాళీలు భర్తీ చేస్తున్నప్పుడు ఈ కోర్సులు పూర్తి అప్రెంటిస్ శిక్షణ పొందినవారికి ప్రాధాన్యత లభిస్తుంది.
ఇప్పుడు రాష్ట్రంలో విపరీతంగా వాహనాలున్నాయి. వాటి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. కనుక ఈ కోర్సులలో శిక్షణ పొందితే వాహనాలు తయారుచేసే కంపెనీలలో, వాటి సర్వీసింగ్ సెంటర్లలో ఉద్యోగాలు లభిస్తాయి.
ప్రభుత్వం కూడా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల కోసం, వేలాది వాహనాలు ఉపయోగిస్తుంటుంది. అలాగే టిజిఎస్ ఆర్టీసీతో సహా వివిద శాఖలలో ఈ ఉద్యోగాలున్నాయి.
ఇవేవీ రాకపోయినా సొంతంగా వర్క్ షాప్ పెట్టుకొని జీవనోపాధి పొందవచ్చు. కనీస విద్యార్హతలతో తక్కువ సమయంలో సాంకేతిక శిక్షణ పూర్తి చేసుకొని సులువుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఐటిఐలలో కోర్సుల ద్వారానే సాధ్యం. కనుక ఏ కారణం చేతయినా 10 వ తరగతిపై చదువులు కొనసాగించలేని వారికి ఇది చాలా చక్కటి అవకాశం.
ఐటీఐ విద్యనభ్యసించే వారికి శుభవార్త. హైదరాబాద్, వరంగల్ లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి #TGSRTC దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్లలో ప్రవేశాలు… pic.twitter.com/lsAQQUuYTh