తెలంగాణలోని ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలలో, వాటి అధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్సులలో ప్రవేశాల కొరకు దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసస్ తెలంగాణ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు విడతలలో ఈ ప్రవేశాల ప్రక్రియ జరుగుతుంది.
మొదటి విడత: మే 3 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరణ, మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్స్, మే 29 న సీట్ల కేటాయింపు.
రెండో విడత: మే 30 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తులు స్వీకరణ, మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్స్, జూన్ 13న సీట్ల కేటాయింపు.
మూడో విడత: జూన్ 13 నుంచి జూన్ 19 వరకు దరఖాస్తులు స్వీకరణ, వెబ్ ఆప్షన్స్, జూన్ 23న సీట్ల కేటాయింపు.
జూన్ 30 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం అవుతాయి. కనుక ఇంటర్ ఉత్తీర్ణులలైన విద్యార్ధులు తమ మొబైల్ ఫోన్లలో లేదా దోస్త్ వెబ్ సైట్ ద్వారా లేదా మీ సేవ యాప్‌లో లేదా మీ సేవే కేంద్రాల ద్వారా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని అధికారులు సూచించారు.