రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల హడావుడి

December 15, 2024
img

వివిద ప్రభుత్వ శాఖలలో గ్రూప్-2లో 783 పోస్టులు భర్తీ చేయడానికి టీజీపీఎస్సీ నేడు, రేపు (ఆది, సోమవారం) గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తోంది. వీటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,368 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. గ్రూప్-2 లో 783 పోస్టులకు సుమారు 5.51 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకుని నేడు, రేపు పరీక్షలు వ్రాయబోతున్నారు. 

ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యక్షంగా సుమారు 50 వేలమంది, పరోక్షంగా మరో 75 వేలమంది పనిచేస్తున్నారు.  కనుక నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ గ్రూప్-2 పరీక్షల హడావుడి కనిపించింది. గత ప్రభుత్వం 2015లో నోటిఫికేషన్‌ ఇస్తే 2019 వరకు ఫలితాలు వెల్లడించలేదు. 

కానీ ఈసారి మాత్రం 2025 మార్చి నెలాఖరులోగా గ్రూప్-1,2,3 అన్ని పరీక్షల ఫలితాలు ప్రకటించి వీలైనంత త్వరగా నియామక పత్రాలు అందజేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం చెప్పారు. ఇక నుంచి ప్రిలిమ్స్ ఒక్కటే ఉంటే గరిష్టంగా 6 నెలల్లో, మెయిన్స్ కూడా ఉంటే గరిష్టంగా 6 నెలల్లో ఫలితాలు ప్రకటిస్తూ వీలైనంత త్వరగా నియామక పత్రాలు అందజేస్తామని బుర్రా వెంకటేశం చెప్పారు.

టీజీపీఎస్సీ ప్రకటించే సిలబస్ ప్రకారం అభ్యర్ధులు తగిన పుస్తకాలు ఎంచుకొని పరీక్షలకు సిద్దం కావచ్చని చెప్పారు. యూపీఎస్సీ షెడ్యూల్‌ చూసుకొని దానికి కూడా అభ్యర్ధులు హాజరయ్యేందుకు వీలుగా టీజీపీఎస్సీ షెడ్యూల్ రూపొందించుకుంటామని బుర్రా వెంకటేశం చెప్పారు. 

Related Post