అక్టోబర్‌ నెలాఖరులోగా జేఈఈ-2025 నోటిఫికేషన్‌

October 18, 2024
img

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించే జేఈఈ ప్రవేశ పరీక్షలకు అక్టోబర్‌ నెలాఖరులోగా నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. నవంబర్‌ మొదటివారం నుంచి దరఖాస్తులు స్వీకరించి జనవరిలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనుంది.

మళ్ళీ ఏప్రిల్‌ లేదా మే నెలలో రెండో విడత పరీక్ష నిర్వహించనుంది. వాటిలో ఉత్తీర్ణులైనవారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు వెళతారు. వాటిలో ఉత్తీర్ణులైనవారికి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో 21 పట్టణాలలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. కరోనా కారణంగా తగ్గించిన సిలబస్‌ని మళ్ళీ ఈ పరీక్షలలో కలిపే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.

Related Post