ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేటీకరణ: నిర్మలా సీతారామన్‌

May 16, 2020


img

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా 4వ రోజు ఆర్ధికప్యాకేజీకి సంబందించిన వివరాలను శనివారం సాయంత్రం డిల్లీలో మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు.. 

బొగ్గు, సహజ వనరులు, విమాశ్రయాలు, ఎయిర్‌స్పేస్‌ మేనేజ్‌మెంట్‌, రక్షణ పరికరాలు, ఆయుధాల ఉత్పత్తి, అంతరిక్ష పరిశోధన, అణువిద్యుత్ శక్తి రంగాలలో సంస్కరణలు. ఈ రంగాలను షేర్ మార్కెట్లలో లిస్టింగ్ చేసి ప్రైవేట్ పెట్టుబడులకు వీలుగా చట్ట సవరణలు. వీటి పనితీరును మరింత మెరుగుపరిచడానికే కార్పొరేటీకరించడం... సాధారణ పౌరులు కూడా వాటిలో పెట్టుబడులు పెట్టే వీలుకల్పించడం ద్వారా పెట్టుబడులను పెంచడం లక్ష్యాలు.   

50 శాతం బొగ్గు, గనులలో తవ్వకాలకు ప్రైవేట్ సంస్థలకు అవకాశం. 

ఖనిజాల తవ్వకాలలో ప్రైవేట్ పెట్టుబడులు    

బొగ్గు, బాక్సైట్ గనులు జతగా ప్రైవేట్ సంస్థలకు తవ్వకాలకు అవకాశం.  

బొగ్గు గనుల తవ్వకాలలో మౌలికవసతులు, పునరావాసం కొరకు రూ.50,000 కోట్లు 

బొగ్గు, ఖనిజాల రవాణాకు రూ.18,000 కోట్లతో ప్రత్యేక రైల్వే లైన్ల నిర్మాణం   

జీఐఎస్‌ మ్యాపింగ్‌ ద్వారా వివిద రాష్ట్రాలలో 5 లక్షల హెక్టార్లను మ్యాపింగ్ చేసి, లాండ్ బ్యాంక్ ఏర్పాటు. వాటిలో 3,376 ఇండస్ట్రియల్ పార్కులు, సెజ్‌లు ఏర్పాటు. 

రక్షణ రంగంలో దేశీయంగా ఉత్పత్తులు పెంచి దిగుమతులు తగ్గించబడతాయి. 

రక్షణరంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49శాతం నుంచి 74శాతానికి పెంపు.

రూ. 13,000 కోట్లు పెట్టుబడితో దేశంలో కొత్తగా 12 విమానాశ్రయాల నిర్మాణం. పిపిపి పద్దతిలో నడుస్తున్న ఆరు విమానాశ్రయాలు వేలం. 

భారత్‌ ఏరో స్పేస్ (గగనతలం) మార్గాలు హేతుబద్దీకరించడం ద్వారా మరిన్ని ప్రైవేట్ విమానయాన సంస్థలకు అవకాశం కల్పించబడుతుంది. 

విమానాశ్రయాల అభివృద్ధికి ఎయిర్ పోర్ట్ ఆధారిటీ ఆఫ్ ఇండియాకు రూ. 2,300 కోట్లు కేటాయింపు.


Related Post