కరోనా కట్టడిలో కొన్ని రాష్ట్రాలు భేష్…కొన్ని ఓకే

April 23, 2020


img

ఈ నెల 11వ తేదీన భారత్‌లో 11,511 కరోనా కేసులు నమోదు కాగా 22వ తేదీకి అవి 21,450కి చేరాయి. అంటే 11 రోజుల వ్యవధిలో దేశంలో కరోనా కేసులు దాదాపు రెట్టింపు అయ్యాయన్నమాట! అయితే కొన్ని రాష్ట్రాలలో మాత్రమే కరోనా కేసులు పెరుగుతుండగా చాలా రాష్ట్రాలలో కరోనా పూర్తి నియంత్రణలో ఉండటం చాలా సంతోషించవలసిన విషయమే. 

కరోనా కేసుల పెరుగుదల ఆధారంగా దేశంలో రాష్ట్రాలను నాలుగు భాగాలుగా విభజించవచ్చు. 

1. శరవేగంగా పెరుగుతున్నవి. 2. మధ్యస్థం. 3. నియంత్రణలో ఉన్నవి. 4. పూర్తిగా నియంత్రణలో ఉన్నవి 

 శరవేగంగా పెరుగుతున్నవాటిలో మహారాష్ట్ర (5,649), గుజరాత్ (2,407), డిల్లీ (2,248), రాజస్థాన్ (1,935), తమిళనాడు (1,629), మధ్యప్రదేశ్ (1,587), ఉత్తరప్రదేశ్ (1,449) ఉన్నాయి. డిల్లీతో సహా ఈ ఆరు రాష్ట్రాలలోనే రోజూ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 

ఉదాహరణకు మహారాష్ట్రలో ఏప్రిల్ 15 నుంచి 22 వరకు నమోదు అయిన కేసులు:   

ఏప్రిల్ 15: 2,684

ఏప్రిల్ 18: 3,320

ఏప్రిల్ 21: 5,218

ఏప్రిల్ 22: 5,648

అవే రోజులలో గుజరాత్‌లో వరుసగా 605,1099,2178,2407 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. డిల్లీతో సహా మిగిలిన నాలుగు రాష్ట్రాలలో కూడా ఇదేవిధంగా రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. కనుక డిల్లీతో సహా ఈ ఆరు రాష్ట్రాలలోనే వలననే జాతీయస్థాయిలో కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోందని చెప్పవచ్చు. 

ఇక 400-1,000 లోపు కేసులు నమోదు అయిన రాష్ట్రాలను మధ్యస్థంగా భావిస్తే వాటిలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్ మరియు కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లను పేర్కొనవచ్చు. ఈ రాష్ట్రాలలో రోజుకు 15 నుంచి 75 వరకు కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఒక్కోరోజు అంతకంటే తక్కువే నమోదు అవుతున్నాయి కనుక ఈ రాష్ట్రాలలో కరోనా పూర్తిగా అదుపులో ఉన్నట్లే చెప్పవచ్చు. 

నియంత్రణలో ఉన్న రాష్ట్రాలలో ఝార్కండ్ (46), ఛత్తీస్ ఘడ్ (36), ఛండీఘడ్ (27), హిమాచల్ ప్రదేశ్ (39), ఉత్తరాఖండ్ (46), 

 పూర్తిగా నియంత్రణలో ఉన్నవాటిలో ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్ (2), మిజోరాం (1), త్రిపుర (2), నాగాలాండ్ (1),అరుణాచల్ ప్రదేశ్‌ (1)ఉన్నాయి. కానీ అసోంలో 32, మేఘాలయలో 12 కేసులు నమోదు అయ్యాయి. విదేశీయులు ఎక్కువగా వచ్చే గోవాలో 7, కేసులు లడాక్‌లో 18 మాత్రమే నమోదు కాగా, నేటివరకు ఆ రెండు చోట్ల మళ్ళీ కొత్త కేసులు నమోదు కాలేదు. 

మిగిలిన రాష్ట్రాలలో కరోనా పూర్తిగా అదుపులోనే ఉంది కనుక మొదటి రెండు స్థానాలలో ఉన్న రాష్ట్రాలలో కరోనాను నియంత్రించగలిగితే, దేశంలోకి కరోనా పూర్తిగా అదుపులోకి రావచ్చు.    



Related Post