మన టీహబ్ స్టార్ట్ అప్ ‘బన్యన్ నేషన్’ కు అందరూ ఓటేయండి

January 10, 2018


img

రాష్ట్రంలో స్టార్ట్ అప్ కంపెనీలకు మంచి బలమైన పునాది వేస్తున్న టీహబ్ యావత్ దేశంలో మంచిపేరు సంపాదించుకొంటోంది. దాని ద్వారా ఏర్పడి ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థ బన్యన్ నేషన్. హైదరాబాద్ లో ఉన్న ఈ సంస్థ అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి దాదాపు 90 శాతం నాణ్యమైన ప్లాస్టిక్ ను పునరుత్పత్తి చేసే రీసైకిలింగ్ సంస్థ. మణి వాజపేయి, రాజ్ మదన్ గోపాల్ అనే ఇద్దరు యువ ఇంజనీర్లు కలిసి దీనిని రూ.5.1 కోట్లు పెట్టుబడితో స్థాపించారు. ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి ఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్న అత్యంత నాణ్యమైన ప్లాస్టిక్ ను ‘బెటర్ ప్లాస్టిక్’ అనే మంచి పేరు కూడా ఇచ్చారు. పర్యావరణానికి మేలు చేస్తున్న కారణంగా ఈ సంస్థ పేరు ప్రఖ్యాతులు విదేశాలకు కూడా వ్యాపిస్తోంది. అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన ‘సర్క్యులర్ ఎకానమీ అవార్డు’ లకు భారత్ తరపున ఎంపికయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఓటింగ్ ఆధారంగా ఇవ్వబోయే ఆ అవార్డును అది దక్కించుకోవాలంటే, భారతీయులు అందరూ దానికి తమ ఓటుతో మద్దతు తెలుపవలసి ఉంటుంది. అందుకోసం https://thecirculars.org/peoples-choice-entrepreneur-award అనే ఈ లింక్ ద్వారా మన ఈ సంస్థకు ఓటు వేయవచ్చు. భారతీయుల మద్దతు లభిస్తే మన టీహబ్ సృష్టించిన బన్యన్ నేషన్ సంస్థకు ఈనెల స్విట్జర్లాండ్, దావోస్ నగరంలో జరుగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రతిష్టాత్మకమైన ఈ ‘సర్క్యులర్ ఎకానమీ అవార్డు’ లభిస్తుంది. 

తెలంగాణా రాష్ట్రంలో ఐటి మరియు పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి కేటిఆర్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా కోరుతూ అయన ప్రత్యేకంగా ఆహ్వానం అందుకొన్న సంగతి తెలిసిందే. 


Related Post