కేసీఆర్‌ దూరదృష్టికి మరో గొప్ప నిదర్శనం ఇదే కదా?

September 30, 2023
img

రాష్ట్రంలో భూగర్భ జలాలపై అధ్యయనం చేస్తున్న రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ డైరెక్టర్ ఎన్.శంకర్, కేంద్ర భూగర్భ జలవనరుల బోర్డు ప్రాంతీయ డైరెక్టర్ జి.కృష్ణమూర్తి తదితరులు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశమయ్యారు.         

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులలో భాగంగా నిర్మిస్తున్న జలాశయాలు, కాలువలు, మిషన్ కాకతీయ పధకం ద్వారా చెరువుల వలన రాష్ట్రంలో పలుజిల్లాలలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. 

డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్-2023 నివేదిక ప్రకారం 2013లో రాష్ట్రంలో భూగర్భజలాలు 472 టీఎంసీలు ఉండగా 2023లో అవి 56 శాతం వృద్ధి చెంది 739 టీఎంసీలకు పెరిగాయని నివేదికలో పేర్కొన్నారు. జాతీయస్థాయి భూగర్భజలాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 83 శాతం పెరుగుదల నమోదైన్నట్లు పేర్కొన్నారు. 

సామాన్య ప్రజలకు అర్దమయ్యే భాషలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన ఈ భూగర్భజలాలు రెండు నాగార్జున సాగర్ జలాశయాలలో ఉండే నీటి పరిమాణానికి సమానమని చెప్పుకోవచ్చు. 

ఒకప్పుడు తెలంగాణలో రైతులు 300 అడుగుల బోర్లు కొట్టినా నీళ్ళు పడకపోవడంతో అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకొనేవారు. కానీ ఇప్పుడు చాలా చోట్ల 100 అడుగుల లోపే నీళ్ళు పడుతున్నాయి. కొన్నిచోట్ల బోరు బావులలో నీళ్లు వాటంతట అవే ఉబికివస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాము.   

రాష్ట్రాభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు, పెద్దపెద్ద భవనాలు కట్టడమో లేదా పరిశ్రమలను, ఐ‌టి కంపెనీలను రప్పించుకొని ఉద్యోగాలు కల్పించడం మాత్రమే కాదు... ఈవిధంగా సంపూర్ణ అభివృద్ధి అని కేసీఆర్‌ నిరూపించి చూపారు. ఇంత దూరదృష్టితో ఆలోచించగల పాలకులు ఎంతమంది ఉంటారు? 

Related Post