పాయల్ రాజ్‌పుత్ రక్షణ రేపే విడుదల

June 06, 2024


img

తెలుగు సినీ పరిశ్రమలోకి ఆర్‌ఎక్స్‌ప్రెస్‌ 100తో సునామీలా దూసుకువచ్చిన పాయల్ రాజ్‌పుత్ ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. కానీ అవన్నీ ఆమెకు మంచి నటిగా గుర్తింపునిచ్చాయే తప్ప నంబర్:1 హీరోయిన్‌గా నిలబెట్టలేకపోయాయనే చెప్పవచ్చు. తాజాగా ఆమె ‘రక్షణ’ అనే సినిమాతో రేపు (శుక్రవారం) తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

ప్రాణ్‌దీప్ స్వీయ దర్శకత్వంలో హరిప్రియా క్రియెషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో పాయల్ ఓ పవర్ పోలీస్ ఆఫీసరుగా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేదిగానే ఉంది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, చక్రపాణి ఆనంద, మానస్ నాగులపల్లి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

ఈ సినిమాకు డైలాగ్స్, స్క్రీన్ ప్లే: టి.శివకుమార్, సంగీతం: మహతీ సాగర్, కెమెరా: అనిల్ బండారి, ఆర్ట్: రాజీవ్ నాయర్, స్టంట్స్‌: వెంకట్, రామకృష్ణ, ఎడిటింగ్: గ్యారీ బిహెచ్ చేశారు.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/iOWAJueksXU?si=6YDx9gSFH5TMFplK" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>


Related Post

సినిమా స‌మీక్ష