శర్వా మనమే ట్రైలర్‌... టార్గెట్: ఫ్యామిలీ ఆడియన్స్?

June 01, 2024


img

శర్వానంద్, కృతి శెట్టి జంటగా వస్తున్న ‘మనమే’ సినిమా ట్రైలర్‌ ఈరోజే విడుదలైంది. ట్రైలర్‌ చూస్తే యువత, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాతో బాగానే కనెక్ట్ అయ్యేలా ఉంది. కాస్త రొమాన్స్, కాస్త భావోద్వేగాలు, మద్యలో ఒకటీ అరా చిన్న ఫైట్స్... మొత్తంగా ట్రైలర్‌ బాగానే కట్ చేశారు.   

ఈ సినిమాకు కధ, దర్శకత్వం శ్రీరామ్ ఆదిత్య, డైలాగ్స్: అర్జున్, కార్తీక్, ఏఆర్ టాగూర్, వెంకట్ డి పతి, సంగీతం: హెషామ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: విష్ణుశర్మ, జ్ఞాన శేఖర్, కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి, శ్రష్టి వర్మ, విజయ్‌ పోలకి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: జానీ షేక్, స్టంట్స్‌: రియల్ సతీష్, కెఎన్ఆర్ (నిఖిల్) చేస్తున్నారు. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, వివేక్‌ రామస్వామి కూచిభొట్ల సహ నిర్మాతగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/3zOCInbXzy8?si=2iOJp7JBVkqimhez" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe> Related Post

సినిమా స‌మీక్ష