అమెజాన్ ప్రైమ్‌లో... ఆ ఒక్కటీ అడక్కు

May 31, 2024


img

అల్లరి నరేశ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత చేసిన పూర్తిస్థాయి కామెడీ సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’ మే 3వ తేదీన థియేటర్లలో విడుదపై ప్రేక్షకులను అలరించింది. నాలుగు వారాలు కాక ముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో ఈ సినిమా ప్రసారం అవుతోంది. 

నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఫారియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించాగా వెన్నెల కిషోర్, జెమీ లివర్, రీతూ చౌదరి, అరియాన తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

కధేమిటంటే, రిజిస్ట్రార్ ఆఫీసులో ఉద్యోగిగా పనిచేసే గాన అలియాస్ గణపతి (అల్లరి నరేశ్) చేతుల మీదుగా వందల మందికి పెళ్ళిళ్ళు జరుగుతాయి. కానీ అతను మాత్రం పెళ్ళికానీ ప్రసాదులాగే మిగిలిపోతాడు. దీంతో ఓ మ్యారేజీ బ్యూరోలో తన పేరు నమోదు చేసుకుంటాడు. అక్కడి నుంచి మొదలయ్యే గిలిగింతలే ఈ సినిమా. ఇంకా చెప్పుకోవడం కంటే ఓటీటీలో చూసి ఆందిస్తేనే బాగుంటుంది.      Related Post

సినిమా స‌మీక్ష