మైత్రీతో విజయ్‌ దేవరకొండ మరో కొత్త సినిమా

May 10, 2024


img

విజయ్‌ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా గురువారం రెండు కొత్త సినిమాల ప్రకటనలు వెలువడ్డాయి. వాటిలో ఒకటి శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించబోతున్నారు. మరో సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించబోతోంది. 

రెండు సినిమాలు విజయ్‌ దేవరకొండ ఇమేజ్‌కు భిన్నంగానే కనిపిస్తున్నాయి. దిల్‌రాజు సినిమాలో ‘కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే...’ అంటూ ఏదో కొత్తగా ప్రయత్నించబోతున్నట్లు సూచించగా, మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోతున్న సినిమాలో “వీరగాధలు లిఖించబడవు... అవి వీరుల రక్తం నుంచే ఆవిర్భవిస్తాయి. ఓ శాపగ్రస్తమైన సామ్రాజ్యానికి చెందిన ఓ వీరుడిని పరిచయం చేస్తున్నాము..,” అంటూ 18వ శతాబ్ధంలో జరిగిన ఓ చారిత్రిక నేపధ్యం కలిగిన సినిమా అని సూచించారు. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించబోతున్నారు.

విజయ్‌ దేవరకొండ ఇంతవరకు ఇటువంటి సినిమాలు చేయలేదు. ఇద్దరు దర్శకులు విజయ్‌ దేవరకొండని పూర్తి భిన్నంగా చూపించబోతున్నారు. రెండు సినిమాలకు సంబందించి వివరాలు ఇంకా ప్రకటించవలసి ఉంది. 

     

        Related Post

సినిమా స‌మీక్ష