శ్రీహర్ష కొంగుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు ప్రధాన పాత్రలలో ‘ఓం భీమ్ బుష్’ (నో లాజిక్... ఓన్లీ మ్యాజిక్) సినిమా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సినిమా టీజర్ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. టీజర్‌లో కామెడీ సీన్స్ చూస్తే ఈ సినిమా కూడా ‘జాతి రత్నాలు’ సినిమాలోలా సూపర్ హిట్ అవడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఈ సినిమాలో వీరి ముగ్గురితో పాటు ప్రీతి ముకుందన్, ఆయెషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్యా మీనన్, రచ్చ రవి ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శ్రీహర్ష, సంగీతం: సన్నీ ఎంఆర్, కెమెరా: రాజ్ తోట, ఎడిటింగ్: విజయ్ దేవరకొండ వర్ధన్ కుమార్, యాక్షన్: వింగ్ చున్ అంజి, కొరియోగ్రఫీ: విజయ్ దేవరకొండ బిన్నీ, శిరీష్, వీఎఫ్ఎక్స్: బాలాజీ ముప్పల. ఈ సినిమాని వి.సెల్యూలాయిడ్, యూవీ క్రియెషన్స్ బ్యానర్లపై సునిల్ బలుసు నిర్మిస్తున్నారు.