ఓం భీమ్ బుష్... టీజర్‌ రెడీ!

February 25, 2024


img

శ్రీహర్ష కొంగుగంటి రచించి, దర్శకత్వం చేస్తున్న సినిమా ‘ఓం భీమ్ బుష్’ (నో లాజిక్... ఓన్లీ మ్యాజిక్)  ఫస్ట్-లుక్ పోస్టర్‌తోనే అదరగొట్టేశారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.

ముగ్గురూ స్పేస్ సూట్స్ ధరించి ఫ్లయింగ్ సాసర్‌లో నుంచి ఓ భవనం ముందు దిగిన్నట్లు ఫస్ట్ గ్లిమ్స్‌లో చూపారు. అక్కడ వారికి దొరికిన ఓ కాగితంలో అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తారంటూ సినిమా కధని సింపుల్‌గా చెప్పేశారు. అయితే ముగ్గురూ ఫ్లయింగ్ సాసర్‌లో నుంచి దిగడం చూస్తే ఏదో పెద్ద కధే ఉందనిపిస్తుంది.

ఈ సినిమా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. కనుక రేపు (సోమవారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఆర్‌కె కాంప్లెక్స్ లో ఈ సినిమా టీజర్‌ విడుదల చేయబోతున్నట్లు యూవీ క్రియెషన్స్ ట్వీట్‌ చేస్తూ మరోసారి ఫస్ట్ గ్లిమ్స్‌ కూడా పెట్టింది.    

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శ్రీహర్ష, సంగీతం: సన్నీ ఎంఆర్, కెమెరా: రాజ్ తోట, ఎడిటింగ్: విజయ్‌ దేవరకొండ వర్ధన్ కుమార్, యాక్షన్: వింగ్ చున్ అంజి, కొరియోగ్రఫీ: విజయ్‌ దేవరకొండ బిన్నీ, శిరీష్, వీఎఫ్ఎక్స్: బాలాజీ ముప్పల. ఈ సినిమాని వి.సెల్యూలాయిడ్, యూవీ క్రియెషన్స్ బ్యానర్లపై సునిల్ బలుసు నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష